Sunday, August 29, 2010

ఆఫీస్ ఇంటీరియర్స్..

కొన్నేళ్ళ క్రితం..........
ఆఫీసు అంటే ఒక పాత బంగాళా,లోపల టేబుల్ పైన ఫైల్సు, వాటి వెనుక ఆపసోపాలు పడుతూ పని చేసే గుమాస్తాలు, కిర్రు కిర్రు మంటూ శబ్దం చేసే ఫ్యాన్లు, ఈ మధ్యలో యూనిఫాం వేసుకుని అటు ఇటు హడావిడిగా తిరిగే బంట్రోతులు..
ఇప్పుడు...............
ఆఫీసు అంటే ఐదు నక్షత్రాల హోటల్సు ని తలపించే రిసెప్షన్, ఎంట్రన్సు లాబీలు,వైట్ కాలర్ ఉద్యోగులు,ఏసి ల నుంచి వీచే చల్లని పిల్లగాలులు, వీలయితే నాలుగు మాటలు,కుదిరితే కప్పు కాఫీ తాగటానికి ఫుడ్ కోర్ట్లులు,పని వత్తిడి నుంచి సేద తీరడానికి రిక్రిఏషన్ సెంటర్లు..     

కొన్నేళ్ళ క్రితం అలా ఉన్నఆఫీసుని ఇప్పటిలా మారిస్తే........

సాధారణముగా కార్పోరేట్ ఆఫీసులు బిల్డర్స్ నుంచి భవనాలను లీజుకి తెసుకుంటాయి. కావున లోపల ఇంటీరియర్స్ సదరు కంపెనీలే తమ తమ అవసరాలకు తగినట్లు ప్లాన్ చేచేయించుకుంటాయి. లీజు సమయం పూర్తైన తరువాత ఒక కంపెనీ మరో బిల్డింగ్ కు మారదామనుకుంటే మునుపు చేయించుకున్న ఇంటీరియర్స్ వృధా అవకుండా పూర్వపు మెటీరియల్స్ నే ఉపయోగించుకునేట్లు చూసుకుంటారు.దీని గురించి కొంచం వివరంగా చర్చిస్తే .......

1 .పార్టీషన్స్: సాధారణముగా ఇంటీరియర్ వర్క్స్ లో స్పేస్ ని డివైడ్ చేసుకోవడానికి ఇటుకలతో గోడలు కట్టరు. ఈజీ గా డిస్మాంట్ల్ చేయడానికి వీలుగా అల్యుమినియం సప్పోర్ట్స్ మీద MDF  బోర్డుని ఫిక్స్ చేసి దాని ఫై జిప్సమ్ తో ఫినిషింగ్ చేసి పైంట్ వేస్తారు. కానీ చూడడానికి మాత్రం మమూలు గోడల్లానే ఉంటాయి.


౨. ఫాల్స్ సీలింగ్: పేరు లోనే దీని అర్ధం ఉంది. ఏసి, ఎలక్ట్రికల్ ఫైపులను మనకు  బయటకు కనపడకుండా చేయడానికి ఇది సహకరిస్తుంది. సాధారణంగా ఇవి రెండు రకాలు. ఒకటి జిప్సమ్ సీలింగ్, రెండోది గ్రిడ్ సీలింగ్. జిప్సమ్ సీలింగ్ పార్టీషన్స్ లానే అల్యుమినియం సపోర్ట్స్ మీద జిప్సమ్ బోర్డుని ఫిక్స్ చేసి పెయింట్ తో ఫినిషింగ్ చేస్తారు.గ్రిడ్ సీలింగ్ సులభతరము ఐనది.దీన్ని ఈజీ గా నిర్మించచ్చు. ఈజీ గా డిస్మాంట్ల్ చేయొచ్చు.



3.కార్పెట్ ఫ్లోరింగ్: ఈ కార్పెట్ కూడా మాములు టైల్సు రూపం లోనే ఉంటుంది. అదేసివ్ తో వీటిని అతికిస్తారు.వీటిని కావాలంటే తొలగించి, వేరే చోట అతికించుకోవచ్చు. కాబట్టి వేస్ట్ అనేది ఉండదు.

ఇలానే వర్క్ స్టేషన్ లు. వీటిని కూడా ఎప్పుడు పడితే అప్పుడు  డిస్మాంట్ల్ చేసుకొని వేరే చోట మరల ఉపయోగించుకోవచ్చు. వాల్ పేపర్స్ కూడా రూముకి అందాన్ని తీసుకు రావడం లో ప్రముఖ పాత్రను పోషిస్తాయి.


ఇవండీ టూకీగా ఆఫీసు  ఇంటీరియర్స్ విషయాలు..

No comments:

Post a Comment