Sunday, October 31, 2010

5 గంటల్లో వెయ్యేళ్ళు వెనక్కి

కీ.శ.12 వ శతాబ్ద్హం:
ఒక శిల్పి పగలనక రేయనక కర్తవ్యమే దైవంగా బండరాళ్ళను అద్బుత శిల్పాలుగా మలుస్తున్నాడు.అతని అకున్ట్టిత దీక్ష ముందు రోజులు నిమిషాల్లా,సంవత్సరాలు రోజులల గడుస్తున్నాయి.ఆ శిల్పి జక్కనాచార్యుడు.అతను మలుస్తున్న అద్బుత శిల్ప సంపద బేలూరు లోని చేన్నకేశవాలయం.

                                                              **      **                   
గత కొంతకాలంగా వారాన్తాలను ఇంటి వద్దే వెళ్ళదీస్తున్న నాకు, మా కజిన్ తోడవ్వడంతో బేలూరుకి బయల్దేరాం.మార్నింగ్ ఎనిమిదింటికల్లా బెంగుళూరు లోని మేజేస్ట్టిక్ బస్సు స్టేషన్ కి చేరుకున్నాం.ఇక్కడనుంచి బేలూరుకి బస్సులు తక్కువగా ఉండటం చేత ముందు బెంగుళూరు-మంగుళూరు హైవే ఫై ఉండి బేలూరు కి దగ్గరలో ఉన్న హస్సన్ కి చేరుకున్నాం.హస్సన్ నుంచి బేలూరు కి ప్రయాణ సమయం గంట లోపే.మొత్తంమీద మధ్యానం ఒంటి గంట కల్ల బేలూరు లో ఉన్నాం.



బస్సు స్టాప్ నుంచి చేన్నకేశవాలయానికి నడిచే వెళ్ళవచ్చు.పది నిమిషాల్లో గాలిగోపురం ముందున్నాం. గాలిగోపురం దాటి లోపలికి అడుగుపెట్టగానే విశాలప్రాంగణం లోని దేవాలయ సమూహం కానవస్తుంది.ముందుగా ప్రధానమైన చెన్నకేశవాలయం లోనికి అడుగుపెట్టాం.


 

దీనిని హొయసాల విష్ణువర్ధనుడు,చోళ రాజులను ఓడించిన సందర్భ్హంగా కట్టించాడు.ఈ దేవాలయ శిల్పకళా సంపద చాలా అద్భ్హుతంగా అనిపించింది. దేవాలయాన్ని మొత్తం సోప్ స్టోన్ తో నిర్మించారు.ఈ  దేవాలయం లోని గర్భ్హగుడి నక్షత్రాకారం లో ఉండటం విశేషం.గుడిలోనికి తూర్పు,ఉత్తర,దక్షిణ దిశల నుంచి ద్వారాలున్నాయి.దేవాలయం లోని స్థంబాలను  కూడా చాలా హృద్యముగా చెక్కారు.


                     





దేవాలయం వెలుపల గోడలమీద దేవతా మూర్తులను కడు రమ్యముగా చిత్రీకరించినారు.ఈ దేవాలయాన్నిదర్శించడం ఒక అద్భుత అనుభవం.ఈ దేవాలయాన్ని పూర్తిగా చూసి ఆకళింపు చేసుకోవడానికి ఒక రోజు సరిపోదు.ఈ అద్బుత కళాసంపదను దర్శించి ఆనందంతో తిరుగుప్రయాణం అయ్యాం.