Tuesday, June 11, 2019

ఉచిత హౌస్ ప్లాన్స్ మీముందుకు వచ్చేసింది

ఉచిత హౌస్ ప్లాన్స్ మీముందుకు వచ్చేసింది. మీ రిక్వైర్మెంట్స్ మెయిల్ చేయవలసిన ఇమెయిల్ pandavamayasbha@gmail.com 

Wednesday, October 1, 2014

వాస్తు ప్రకారము కాడ్ లో డిజైన్

మీరు మీ ఇంటికోసం మమూలు మేస్త్రీ నో లేక ఒక ఇంజనీర్ తో చెయిద్దామనుకున్తున్నారా. ఐతే ఒకసారి మా డిజైన్ హౌస్ ప్లాన్స్ చుడండి. అది కూడా ఉచితముగనె.

మీ ప్లాట్ యొక్క కొలతలను పోస్ట్ చేస్తే చాలు. దానికి తగినట్లుగా వాస్తు ప్రకారము కాడ్ లో డిజైన్ చెయబడును. ఈరోజుల్లొ రియల్ ఎస్టేట్ కి మంచి బూమ్ ఉంది. కానీ దానిని సరిగా వినియోగించవలసిన అవసరం ఉంది. ఒక బిల్డింగ్ ని మన కాంటెంపరరీ గా చేసినచో అది ఎంతోమంది మన్న్ననలను చూరగొమ్తున్ది .



రండి. మన చుట్టూ ఉన్న పరిసరాలను మన ఇళ్ళను తీర్చిదిద్దుకోనాల్సిన బాధ్యత మన మీదే ఉంది. మీ ప్లాట్ కొలతలను పంపవలసిన మెయిల్ pandavamayasbha@gmail.com.




Sunday, August 24, 2014

డిజైన్ హౌస్ ప్లాన్స్ అండ్ అపార్ట్ మెంట్ ప్లాన్స్ ఉచితముగ

మీరు మీ ఇంటికోసం మమూలు మేస్త్రీ నో లేక ఒక ఇంజనీర్ తో చెయిద్దామనుకున్తున్నారా. ఐతే ఒకసారి మా డిజైన్ హౌస్ ప్లాన్స్ చుడండి. అది కూడా ఉచితముగనె.

మీ ప్లాట్ యొక్క కొలతలను పోస్ట్ చేస్తే చాలు. దానికి తగినట్లుగా వాస్తు ప్రకారము కాడ్ లో డిజైన్ చెయబడును. ఈరోజుల్లొ రియల్ ఎస్టేట్ కి మంచి బూమ్ ఉంది. కానీ దానిని సరిగా వినియోగించవలసిన అవసరం ఉంది. ఒక బిల్డింగ్ ని మన కాంటెంపరరీ గా చేసినచో అది ఎంతోమంది మన్న్ననలను చూరగొమ్తున్ది .



రండి. మన చుట్టూ ఉన్న పరిసరాలను మన ఇళ్ళను తీర్చిదిద్దుకోనాల్సిన బాధ్యత మన మీదే ఉంది. మీ ప్లాట్ కొలతలను పంపవలసిన మెయిల్ pandavamayasbha@gmail.com.



Wednesday, August 31, 2011

వినాయక చతుర్థి శుభాకాంక్షలు



బ్లాగు సోదరీ సోదరులకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు.
 మట్టి వినాయకునికి జై 




Tuesday, August 23, 2011

బొమ్మాళీ పిలిచెన్

బస్సు రైల్వే ట్రాకును దాటింది. నా కళ్ళు లెఫ్ట్ సైడ్ లో వచ్చే బోర్డును, పాత కోటను వెతుకుతున్నాయి. సినిమాలోవి పూర్తిగా సెట్టిన్గులే అని తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. గద్వాల్ పట్టణం హైదరాబాద్ నుంచి సుమారు 190 km దూరం లో ఉంది. కర్నూలు కి అరవయ్ కిమీ, రాయచూరు నుంచి యాభయ్ కిమీ దూరంలో ఉంది. బెంగలూరు - హైదరాబాద్ ని కలిపే NH-7 నుంచి బహు సమీపంలో (15 కి మీ) ఉన్నది. రాయచూరు కి దగ్గరగా ఉండటం వలన ఇక్కడ కన్నడ మాట్లాడే వారు కూడా కనిపిస్తారు.



ఈ ప్రదేశానికి మూడొందల సంవత్సరాల చరిత్ర ఉంది.ఇండియన్ గజేట్ట్ లో గద్వాల్ ప్రస్తావన ఉంది. ఇక్కడ నేసిన చీరలకి ప్రపంచ ప్రసిద్ధమే. పట్టణానికి సరిగ్గా మధ్యలో కోట ఉంది. దీనిని 16 వ శతాబ్దంలో సోమనాధ్రి అనే రాజు నిర్మించాడు. పూర్తిగా మట్టి తో కట్టిన ఈ నిర్మాణం ప్రస్తుతం శిధిలావస్తలో ఉంది. కోట ప్రాంగణంలో జమలా దేవి గుడి, ప్రభుత్వ కాలేజీ ఉన్నాయి. అప్పట్లో కోట చుట్టూ నిర్మించిన కందకం ఇప్పటికి ఉంది. కాకపోతే దాన్ని సరిగా పట్టిచుకోకపోవడం వలన మామూలు నాలా లానే తయారయ్యింది.


కాలానుగునంగా కోట చుట్టూ ఉన్న ప్రదేశం వ్యాపార, ప్రభుత్వ కార్యకలాపాలకు అనుగుణంగా మారింది. మునిసిపల్ ఆఫీసు, కోనేరు కోటకు కూతవేటు దూరంలోనే ఉన్నాయి. ఈ కోనేరులో ఇప్పటికీ స్వచ్చమైన నీరు లభ్యమవుతుంది. సాధారణంగా కొన్ని పట్టణాల్లో ఉన్న కోనేర్లు నిర్లక్ష్యానికి గురై చెత్త పారబోసే ప్రదేశాలుగా మారుతున్నాయి. మునిసిపల్ ఆఫీసు లో ఉన్నవాళ్లు పక్కనున్న కోనేరుని కూడా పట్టించుకోకపోతే ప్రజలేమనుకుంటారో అనుకున్నారేమో, దీనిని చక్కగా కాపాడుతున్నారు.


అక్కడక్కడ ప్రధాన రహదార్లపయి ఉన్న పాత నిర్మాణాలు మనల్ని ఆ కాలానికి తెసుకువెల్తాయి.పట్టణం పాతదవటం వలన రహదారులు ఒక సరియిన పాట్టేర్న్ లో అభివృద్ధి చెందలేదు. కొత్తవారు ఈ రోడ్లలో అయోమోయానికి గురవటం ఖాయం. కొన్ని రహదార్లు ఆటో కూడా పట్టనంత సన్నగా ఉన్నాయి. మునిసిపాలిటి వారు ఆ పాత రోడ్లనే సిమెంట్ రోడ్లుగా మార్చేసారు. పట్టణం అభివృద్ధి చెందే కొద్ది ఈ రహదార్లు ఒక తలనొప్పిగా మరే అవకాసం ఉంది. మరొక విశాదమేమంటే పరిణామ క్రమంలో ఈ రోడ్ల ఫై ఉన్న పాత ఇళ్ళని కొత్త ఇళ్ళు ఆక్రమిస్తున్నాయి, కానీ రోడ్ విడ్త్ మారడం లేదు. ఐతే పట్టాన శివార్లలో ఇప్పుడవుతున్న డెవలప్మెంట్ పధ్ధతి ప్రకారమే అవుతున్నట్టనిపిస్తోంది.


పట్టణంలో ఓపెన్ డ్రయినేజి వ్యవస్థ ఉంది. కొన్ని ఏరియాలలో క్లీనింగ్ రెగ్యులర్గా చేయకపోవడం వలన దుర్వాసన, రోగాలకు కారకులవుతున్నాయి. అయిజా, క్రిష్ణాగ్రహారం వెళ్ళే రూట్లలో కొన్నిఆయిల్ మిల్లులు, అనుప్లెక్ష్ గ్లాస్ కర్మాగారం ఉన్నాయి.

 పట్టణానికి 5 కిమీ దూరంలో ఉన్న క్రిష్ణాగ్రహారం కృష్ణా నది వొడ్డున ఉంది. బీచుపల్లి కూడా ఇక్కడకి దగ్గరే. పట్టాన శివార్లలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ డాం ఉంది. మరోవైపు ఉన్న బాలన్సింగ్ రెసెర్వొఇర్లో మన ప్రభుత్వ పర్యాటక సంస్థ బోటింగ్ ఏర్పాట్లు చేసింది. సాయంకాలం ఇక్కడ ఉన్నఆంజనేయస్వామి గుడిని దర్శించుకొని కొలనులో షికారు చేయడం ఒక మధురానుభూతి. పట్టణానికి ల్యాండ్మార్క్గా నిలచిన కోట గురించి సరియిన పరిరక్షణ చర్యలు తెసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

Thursday, November 4, 2010

చీకటి వెలుగుల రంగేళి...........




          
బ్లాగు మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు.